రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు.. శత్రువులు ఉండరు: కవిత
ABN , First Publish Date - 2021-10-17T20:43:35+05:30 IST
రాజకీయంగా ప్రత్యర్థులు ఉంటారని, శత్రువులు ఉండరని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత అన్నారు.
హైదరాబాద్: రాజకీయంగా ప్రత్యర్థులు ఉంటారని, శత్రువులు ఉండరని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని జలవిహార్‌లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఈ వేడుకలో వారూ, వీరూ అనే బేధం లేకుండా అన్ని పార్టీల వారిని పిలిచి నిజమైన దసరా స్ఫూర్తిని తెలంగాణ ప్రజలకు బండారు దత్తాత్రేయ గుర్తు చేస్తున్నారని కొనియాడారు. ఈ వేడుకలో తనను కూడా భాగస్వామిగా చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ వేదికలో అన్ని పార్టీలకు చెందిన నాయకులతో కలిసి కూర్చోడం చాలా బాగుందన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు మంచి సందేశమన్నారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా.. ప్రజల మంచి కోసం అందరం కలిసి నిలబడతామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడం ఆనందంగా ఉందని కవిత అన్నారు.