సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ఫస్ట్‌

ABN , First Publish Date - 2021-02-25T05:04:52+05:30 IST

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ఫస్ట్‌

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ఫస్ట్‌

కాజీపేట, ఫిబ్రవరి 24: పేదల కోసం ఎన్నో సంక్షే మ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని, సంక్షేమ పథకాల అమలులో తెలంగా ణ మొదటిదని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌  తెలిపారు. కాజీపేట 36వ డివిజన్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో బుధవారం డివిజన్‌ అధ్యక్షుడు పి.సురేశ్‌బాబు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు జరిగింది. స్థానికులు పెద్ద ఎత్తున వినయ్‌భాస్కర్‌ చేతులమీదుగా సభ్యత్వం తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు పి.సురేశ్‌బాబు, ఎస్‌ఆర్‌వీరావు, ఐలయ్య, రమేశ్‌తోపాటు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

మడికొండ: కాజీపేట మండలం రాంపూర్‌లో బుధవారం టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని 34వ డివిజన్‌ కార్పొరేటర్‌ జోరిక రమేష్‌ ప్రారంభించారు. అలువాల సురేష్‌, దేవేందర్‌రావు, విజయ్‌కుమార్‌, ఏర్పుల రాజు, సదానందం, రాంచంద్రం, యాదగిరి, కుమార్‌, శ్రీనివాస్‌, రమేష్‌, సునీల్‌, తిరుపతి, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.  కడిపికొండలో అరూరి యువసేన ఆధ్వర్యంలో బుధవారం టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. దర్గా  పీఏసీఎస్‌ చైర్మన్‌ ఊకంటి వనంరెడ్డి కార్యకర్తలకు పార్టీ సభ్యత్వం అందజేసి మాట్లాడారు.  కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకుడు నూటెంకి సతీష్‌, నాయకులు కుంభం శాంతికుమార్‌, బిల్ల సత్తిరెడ్డి, పైడిపాల శ్రీనివాస్‌, పానుగంటి సాగర్‌, మునిగాల కిరణ్‌, దాసరి శ్రవణ్‌, సందీప్‌ పాల్గొన్నారు.  

 

Updated Date - 2021-02-25T05:04:52+05:30 IST