Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏనుగులు వెళ్తుంటే కుక్కలు అరుస్తాయని ఊరుకున్నా: కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాఖ అధినేత బండి సంజయ్ చేస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటుగా స్పందించారు. ఏనుగులు వెళ్తుంటే కుక్కలు అరుస్తున్నాయని ఊరుకున్నానని ఆయన అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘చాలా రోజులుగా బండి సంజయ్‌ అతిగా మాట్లాడుతున్నారు. నాపై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. బండి సంజయ్‌ నా స్థాయి కాదు కాబట్టే నేను పట్టించుకోలేదు. ఏనుగులు వెళ్తుంటే కుక్కలు అరుస్తున్నాయని ఊరుకున్నా’’ అని కేసీఆర్ అన్నారు.


బండి సంజయ్‌కి బాధ్యత లేదని, రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన చేస్తున్న విమర్శలు పూర్తిగా అర్థరహితమని కేసీఆర్ అన్నారు. ‘‘వరి కొనుగోళ్లపై కేంద్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. ధాన్యాన్ని నిల్వ చేసే సామర్థ్యం రాష్ట్రాల దగ్గర లేదు. కేంద్ర ప్రభుత్వం కావాలనే మెలికలు పెడుతోంది. బండి సంజయ్‌ కేంద్రం మెడలు వంచుతారా? ధాన్యం కొంటామని కేంద్రం ఆదేశాలు ఇస్తుందా? గత యాసంగిదే 5 లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉంది. ఈ ఏడాది ఎంత ధాన్యం తీసుకుంటామనే క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఏడాది ఎంత ధాన్యం తీసుకుంటామనే క్లారిటీ ఇవ్వలేదు. కోటీ 70 లక్షల టన్నుల ధాన్యం రాబోతోంది’’ అని కేసీఆర్ అన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement