ఆ స్టాక్స్‌లో కేడియా వాటాలు భారీగా పెంపు...

ABN , First Publish Date - 2021-10-23T06:55:13+05:30 IST

ప్రముఖ ఇన్వెస్టర్ విజయ్ కేడియా రెండు మైక్రో క్యాప్ స్టాక్స్‌లోకి మళ్లీ ప్రవేశించారు.

ఆ స్టాక్స్‌లో కేడియా వాటాలు భారీగా పెంపు...


ముంబై : ప్రముఖ ఇన్వెస్టర్ విజయ్ కేడియా రెండు మైక్రో క్యాప్ స్టాక్స్‌లోకి మళ్లీ ప్రవేశించారు. సెప్టెంబరు 2021 డేటా ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ట్రెండ్ లైన్ డేటా ప్రకారం, కేడియా అఫోర్డబుల్ రోబోటిక్ ఆటోమేషన్, ఇనోవేటర్ ఫాసేడ్ సిస్టమ్స్ స్టాక్స్‌లో వాటాలను తీసుకున్నారు. అఫోర్డబుల్ రోబోటిక్‌లో కేడియాకు15.52 లక్షల షేర్లున్నాయి. ఇది సుమారు 15.52శాతం వాటా. ఆసక్తికరమైన విషయమేమిటంటే... ఒకటి, రెండు త్రైమాసికాల్లో ఈ సంస్థలో వాటాలు కొంటూ, అమ్మేస్తూ, మళ్లీ కొంటూ ఓ డిఫరెంట్ స్ట్రాటజీని అవలంభిస్తున్నారు కెడియా. 


అఫోర్డబుల్ రోబోటిక్ సంస్థ అటోమోటివ్, నాన్ ఆటోమోటివ్, జనరల్ ఇండస్ట్రీస్‌కు సేవలను భారత్, చైనా సహా ఇతర ఆసియా దేశాలకు అందిస్తోంది. ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అవసరాలు తీర్చేందుకు టర్న్ కీ సొల్యూషన్స్‌ను అందిస్తోంది ఈ సంస్థ. పూణెకి చెందిన ఈ సంస్థ స్టాక్ ఈ ఏడాది కాలంలో 260 శాతం పెరిగింది. ప్రస్తుతం ఈ స్టాక్ రూ. 116 దగ్గర ట్రేడవుతోంది. 

Updated Date - 2021-10-23T06:55:13+05:30 IST