ఖమ్మం కలెక్టరేట్ వద్ద గిరిజన రైతు ఆందోళన
ABN , First Publish Date - 2021-06-28T18:12:24+05:30 IST
సింగరేణి ఓపెన్ కాస్ట్ విస్తీర్ణంలో భూములు కోల్పోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ
ఖమ్మం: సింగరేణి ఓపెన్ కాస్ట్ విస్తీర్ణంలో భూములు కోల్పోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఖమ్మం కలెక్టరేట్ ముందు గిరిజన రైతు సుందర్ లాల్ కుటుంబసభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు. లేని పక్షంలో తమకు ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ విస్తరణలో భాగంగా కారేపల్లి మండలం రేలకాయలపల్లిలో గిరిజన రైతులు భూములు కోల్పోయారు. ఈ క్రమంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్‌లో రైతు నిరసన దీక్ష చేపట్టారు. ఇల్లెందు నుంచి ఖమ్మం కలెక్టరేట్ వరకు ఎడ్లబండిపై వచ్చి నిరసనకు దిగారు.