Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఖమ్మంలో 18 కిలోల గంజాయి పట్టివేత

ఖమ్మం: అక్రమంగా తరలిస్తున్న 18 కిలోల గంజాయిని ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈసంఘటన మండల పరిదిలోని వరంగల్‌ క్రాస్‌రోడ్‌లో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన షేక్‌.అస్లాం, కేవరి అమూల్‌ ఒడిశా 18 కిలోల గంజాయిని కొనుగోలు చేసి దాన్ని బ్యాగులలో వేసుకుని మహారాష్ట్రకు బయలు దేరారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వరంగల్‌ క్రాస్‌రోడ్‌లో తనిఖీలు చేపట్టగా అస్లాం, అమూల్‌లు లారీ దిగి బ్యాగులతో వేరే వాహనం ఎక్కేందుకు ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 18 కిలోల గంజాయిని సీజ్‌ చేశారు. గంజాయి సరఫరా చేస్తున్న వారిపై కేసు నమోదు చేసనట్లు ఎస్‌ఐ జయశ్రీ తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement