Khammam: పోలీస్ వాహనానికి తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2021-07-22T17:27:24+05:30 IST

జిల్లాలో పోలీస్ వాహనానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.

Khammam: పోలీస్ వాహనానికి తప్పిన ప్రమాదం

ఖమ్మం: జిల్లాలో పోలీస్ వాహనానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. పెనుబల్లి మండలం వియం బంజర్‌లో పోలీస్ స్టేషన్ నుండి బయటకు వస్తూ యూటర్న్ తీసుకుంటున్న పోలీస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఎస్సై నాగరాజు, కానిస్టేబుల్ శ్రీను కారులో ఉన్నారు. కాగా వీరిరువురూ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. సుమో సైడ్ భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-07-22T17:27:24+05:30 IST