Abn logo
Oct 23 2021 @ 15:18PM

దళిత బంధుకు ఈటల పేరు పెట్టాలి: కిషన్‌రెడ్డి

హుజురాబాద్: మాజీమంత్రి ఈటల రాజేందర్ వాళ్లే హుజురాబాద్ ప్రజలకు దళిత బంధు వచ్చిందని, దళిత బంధుకు ఈటల పేరు పెట్టాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కమలాపూర్ మండలం గూడూరులో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బీజేపీకి విశేష స్పందన వస్తుందని తెలిపారు. సీఆర్ సీఎం అయితే బంగారు తెలంగాణ చేస్తా అన్నారని, తన కుటుంబాన్ని మాత్రమే బంగారం చేసుకున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రశ్నించే గొంతులు ఉండ కూడదు అనేదే కేసీఆర్ సిద్ధాంతమని తప్పుబట్టారు. హుజురాబాద్ ఎన్నికలు ఆత్మగౌరవ ఎన్నికలన్నారు. కేసీఆర్ కుటుంబానికి హుజురాబాద్ ఎన్నికలో బుద్ది చెప్పాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. 

ఇవి కూడా చదవండిImage Caption