Abn logo
Oct 25 2021 @ 14:51PM

ఈటలను, ఆయన భార్యను జైల్లో పెట్టడానికి కేసీఆర్ కుట్ర: కిషన్‌రెడ్డి

హుజురాబాద్‌: రాష్ట్రంలో ప్రశ్నించేవారు ఉండొద్దనే కేసీఆర్ ఆలోచన అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయో కేసీఆర్ చెప్పాలి? అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ అబద్ధాల, అవినీతి, కుటుంబ పార్టీ అని విమర్శించారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ బానిస అనుకుంటున్నారని చెప్పారు. ఈటలను, ఆయన భార్యను జైల్లో పెట్టడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 

ఇవి కూడా చదవండిImage Caption