ఉద్యోగాన్నిచ్చి ఉపాధి చూపండి..

ABN , First Publish Date - 2021-06-28T04:53:04+05:30 IST

ఉద్యోగాన్నిచ్చి ఉపాధి చూపండి..

ఉద్యోగాన్నిచ్చి ఉపాధి చూపండి..
కిశోర్‌కుమార్‌ (ఫైల్‌)

 పంచాయతీ కార్యదర్శి కిశోర్‌కుమార్‌ కరోనాతో కన్నుమూత

 భార్య వారసత్వ ఉద్యోగానికి నిబంధనలు అడ్డు

కేయూ క్యాంపస్‌, జూన్‌ 27: పేద కుటుంబంలో పుట్టి, పట్టుదలతో ఉన్నత చదువులు చదివి పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాన్ని సంపా దించి భార్య, బిడ్డలతో పాటు అమ్మ, తమ్ముడికి కిశోర్‌కుమార్‌. పెద్ద దిక్కుగా నిలిచాడు. ఈ క్ర మంలో కరోనా సోకడంతో అంతా తలకిందులైం ది. కరోనాతో చికిత్స పొందుతూ ఓ పంచాయతీ సెక్రటరీ మృతిచెందడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళితే..

వరంగల్‌లోని ఖమ్మం రోడ్డు విద్యానగర్‌కాలనీకి చెందిన పనికర కిశోర్‌కుమార్‌.. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండ గ్రామంలో పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో మే నెల మొదటి వారంలో కరోనా సోకింది. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మే 16న మృతి చెందాడు. కిశోర్‌ మృతితో భార్య అని త, తల్లి భారతమ్మ, తమ్ముడు శ్రీకాంత్‌, పిల్లలు అఖిలేశ్‌, అఖిర దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 

ఉద్యోగం కోసం భార్య పడిగాపులు

కిశోర్‌కుమార్‌ మృతితో పెద్దదిక్కు కోల్పోయిన అతడి భార్య అనిత.. కుటుంబ పోషణ కోసం భర్త ఉద్యోగాన్ని తనకు ఇప్పించాలని వేడుకుంటోంది. కిశోర్‌కుమార్‌ పంచాయతీ కార్యదర్శిగా రెండేళ్ల ప్రొబేషన్‌ పీరియడ్‌ పూర్తిచేశాడు. అయితే గతంలో సీఎం కేసీఆర్‌ పంచాయతీ సెక్రటరీలకు రెండేళ్లు సర్వీస్‌ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేస్తామని ప్రకటించినప్పటికీ ఉత్తర్వులు జారీ కాలేదని చెబుతున్నారు. కాగా, వారసత్వ కోటాలో భర్త ఉద్యోగాన్ని తనకు ఇప్పించాలని అనిత వేడుకుంటోంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ స్పందించి కిశోర్‌కుమార్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2021-06-28T04:53:04+05:30 IST