పవర్ ప్లేలో కేకేఆర్ 57.. చివరి బంతికి వికెట్

ABN , First Publish Date - 2021-04-18T23:35:54+05:30 IST

కోల్‌కతా నైట్ రైడర్స్ పవర్ ప్లే పూర్తయ్యే సమయానికి 57 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌‌తో ..

పవర్ ప్లేలో కేకేఆర్ 57.. చివరి బంతికి వికెట్

చెన్నై: కోల్‌కతా నైట్ రైడర్స్ పవర్ ప్లే పూర్తయ్యే సమయానికి 57 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి 6 ఓవర్లలో కేకేఆర్ ధాటిగా ఆడి 57 పరగులు చేసింది. 6వ ఓవర్లో ఓ ఫోర్, ఓ సిక్స్ కొట్టి ఊపుమీదున్న రాహుల్ త్రిపాఠి(25: 20 బంతుల్లో 5 ఫోర్లు)ని వాషింగ్టన్ సుందర్ ఆఖరి బంతికి అవుట్ చేశాడు. సుందర్ వేసిన క్విక్ డెలివరీని అర్థం చేసుకోలేకపోయిన రాహుల్ త్రిపాఠి స్వీప్ షాట్ ఆడబోయాడు. అయితే బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్‌తాకి గాలిలో ఎగిరింది. ఈ క్రమంలోనే మిడ్ వికెట్‌లో ఉన్న మహ్మద్ సిరాజ్ సునాయాసమైన క్యాచ్ అందుకున్నాడు.

Updated Date - 2021-04-18T23:35:54+05:30 IST