Advertisement
Advertisement
Abn logo
Advertisement

చితక్కొట్టిన కేకేఆర్

షార్జా: ఐపీఎల్ 2021లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అదరగొట్టింది. ముందు బ్యాట్స్‌మన్, ఆ తర్వాత బౌలర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో ఆర్ఆర్‌ను మట్టి కరిపించింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కేకేఆర్ బౌలర్ల దెబ్బకు 16.1 ఓవర్లలో కేవలం 85 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. దీంతో ఐపీఎల్ సెకండ్ షెడ్యూల్‌లోనే అత్యధికంగా 86 పరుగుల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. రాజస్థాన్ తరపున ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా(44: 36 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వారిలో శివమ్ దూబే(18) తప్ప ఒక్కరు కూడా కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ఇక కేకేఆర్ బౌలర్లలో శివమ్ మావి 4 వికెట్లతో అదరగొట్టగా, లోకీ ఫెర్గ్యూసన్ 3 వికెట్లతో రాణించాడు. ఇక షకిబ్ అల్ హసన్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ దక్కించుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ శివమ్ మావికి దక్కింది. ఇక ఈ విజయంతో పాయింట్ల పట్టికలో కేకేఆర్ నాలుగో స్థానంలోకి చేరింది.Advertisement
Advertisement