సమాచారం.. గోప్యం..!.. సర్వే లెక్కలు దాస్తున్న ఆరోగ్య శాఖ ఖమ్మం యంత్రాంగం?

ABN , First Publish Date - 2021-05-14T06:07:48+05:30 IST

గ్రామస్థాయిలోనే కరోనాను కట్టడిచేసేందుకు గాను రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఇంటింటి సర్వేను నిర్వ హిస్తోంది. ఎంతో ఉన్నత లక్ష్యంతో ప్రారంభమైన ఈ సర్వే సమాచారం మాత్రం బయటకు తెలియకపోతుండటం పట్ల ఆక్షేపణలు వ్యక్తమవుతు న్నాయి. ఖమ్మం జిల్లా అదికారులు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సమాచారం.. గోప్యం..!.. సర్వే లెక్కలు దాస్తున్న ఆరోగ్య శాఖ ఖమ్మం యంత్రాంగం?
చింతకాని మండలం నాగలిగొండలో కొవిడ్‌ ఇంటింటి సర్వే దృశ్యం

కొనసాగుతున్న ఇంటింటి సర్వే

422 బృందాల ఆధ్వర్యంలో 1.59లక్షల ఇళ్లలో వివరాలు సేకరణ

ఖమ్మం, మే 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : గ్రామస్థాయిలోనే కరోనాను కట్టడిచేసేందుకు గాను రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఇంటింటి సర్వేను నిర్వ హిస్తోంది. ఎంతో ఉన్నత లక్ష్యంతో ప్రారంభమైన ఈ సర్వే సమాచారం మాత్రం బయటకు తెలియకపోతుండటం పట్ల ఆక్షేపణలు వ్యక్తమవుతు న్నాయి. ఖమ్మం జిల్లా అదికారులు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మం జిల్లాఓ ఆశావర్కర్లతో పాటు గ్రామపంచాయతీ, మెప్మా సిబ్బందితో కలిపి 422బృందాలు సర్వేలో పా ల్గొంటున్నాయి. జిల్లావ్యాప్తంగా 3.50 లక్షలు గృహాలుండగా ఇప్పటికే 1.59లక్షల ఇళ్లకు వెళ్లిన సర్వేబృందాలు కరోనా లక్షణాలు ఉన్నవారికి వైద్య సలహాలు ఇవ్వటంతో పాటు 3,270కిట్లు అందజేసినట్టు సమాచారం. జ్వరం, జలుబు, దగ్గు, కాళ్లనొప్పులు తదితర లక్షణాలున్నవారిని గుర్తించి, కరోనాతో ఇబ్బంది పడుతున్నవారికి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన కిట్లను అందిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉండి వైద్యపరీక్షలకు ఆస్పత్రులకు వెళ్లకుండా ఇళ్లల్లోనే ఉన్నవారికి నివారణ మందులను ఇస్తున్నారు. జిల్లాలో పలువురికి జలుబు, జ్వరం కాళ్లనొప్పులు వచ్చినా.. అని సాధరణంగా వ చ్చినవేనని నిర్లక్ష్యంగా ఉంటున్నట్టు సర్వేలో తెలుస్తోందని సమాచారం. కొం దరైతే ఇంట్లో అందరూ అనారోగ్యంతో ఉన్నా ఆస్పత్రులకు వెళ్లటం లేదన్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి వారికి ఆరోగ్య శాఖ అం దించే కరోనా కిట్లు ఉపయోగపడుతున్నాయి. ఒక్కో బృందం రోజుకు 250 ఇళ్ల చొప్పున జిల్లావ్యాప్తవగా 25వేల ఇళ్లల్లో ఇంటింటి సర్వే చేస్తూ.. తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి ఆక్సిజన్‌ స్థాయిలను పరిశీలిస్తున్నారు. 

వివరాలు ఇవ్వని ఆరోగ్యశాఖ..

ఇంటింటి సర్వే సమాచారాన్ని పారదర్శకంగా నిర్వహించి ప్రజలకు అవ గాహన కల్పించాల్సిన వైద్య ఆరోగ్యశాఖ జిల్లా యంత్రాంగం ఇంటింటి సర్వే సమాచారాన్ని గోప్యంగా ఉంచుతోంది. సర్వేలో గుర్తించిన కరోనా బాధితుల సంఖ్యను కానీ, ఐసోలేషన్‌ సెంటర్‌కు, కరోనా చికిత్స ఆసుపత్రికి తరలిస్తు న్న వారి సంఖ్యను వెల్లడించడం లేదు. ఇంటింటా సర్వే లక్ష్యం ప్రకారం కరో నా కట్టడి కావాలంటే రోజువారీగా సమాచారాన్ని మీడియాకు తెలియ జేయడం, ప్రజలను చైతన్యపరచటం, సర్వేబృందాలు రాని పక్షంలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి ఫిర్యాదులు తీసుకొని సర్వే బృందాన్ని పంపాల్పిన బాధ్యత అధికారులకు ఉంది. సర్వే పూర్తయిన ప్రాంతాలకు వెళ్లి సర్వే జరుగుతున్న తీరుపై పర్యవేక్షణ కూడా అవసరం ఉంది. పైస్థాయిలో  పర్యవేక్షణ పకడ్బందీగా ఉన్పప్పుడే సర్వే లక్ష్యం కిందిస్థాయిలో నెరవేరుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తంతు ముగించారు.. భద్రాద్రి జిల్లాలో నామమాత్రంగా తొలిదశ సర్వే 

కొత్తగూడెం కలెక్టరేట్‌, మే 13: కొవిడ్‌ నియంత్రణలో భాగంగా ప్రభుత్వ చేపట్టిన  ఫివర్‌ సర్వే తొలిదశ భద్రాద్రి జిల్లాలో తూతూ మంత్రంగా సాగింది. గ్రామీణ ప్రాంతాల్లో కొంత మెరుగ్గా సాగినా అర్బన్‌ ప్రాంతాల్లో మాత్రం సర్వే నామమాత్రంగా సాగింది. దీంతో అధికారుల లెక్కలకు క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతన లేకుండా ఉంది. పట్టణాల్లో ఒకే వార్డులో కొన్ని వీధుల్లో సర్వే చేసి మరి కొన్ని వీధులను వదిలేశారు. ఉదాహరణకు పాల్వంచ పట్టణ పరిధిలోని నవభారత్‌ గాంధీనగర్‌ 3వ వార్డులో కొన్ని వీధుల్లోని ఇళ్లను ఇప్పటి వరకు సర్వే చేయలేదు. అధికారులు మాత్రం నూరుశాతం సర్వే పూర్తయిందని ఇంటింటినీ జల్లెడ పట్టామని నివేదికలు సమర్పించారు. సర్వేలోనూ అంకితభావం లోపించిందని చెప్పవచ్చు. జిల్లాలో 3.25లక్షల ఇళ్లను సర్వేచేసి 7,703 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి వారికి హోం ఐసోలేషన్‌ కిట్లు పంపిణీ చేసినట్లు అధికారులు నివేదికల్లో చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 700 బృందాలు, 2.46,737 ఇళ్లను సర్వే చేసి 5,805 మందికి కొవిడ్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. పట్టణ ప్రాంతాల్లో 156 బృందాలను మొత్తం 56,181 ఇళ్లను సర్వే చేసి 1,421 మందికి నిర్ధారించి వారికి హోం ఐసోలేషన్‌ కిట్లు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 44మందిని కొవిడ్‌ కేంద్రాలకు తరలించారు. 

Updated Date - 2021-05-14T06:07:48+05:30 IST