విజయవాడ: గవర్నర్‌కు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ రాసిన లేఖపై మంత్రి కొడాలి నాని స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో నాలుగు సంవత్సరాల పాటు ఎన్నికలు ఎందుకు నిర్వహించ లేదని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నాయకులు చెప్పినట్లుగా నిమ్మగడ్డ నడుచుకుంటుంటే ప్రభుత్వం చూస్తు ఉండిపోవాలా అని మండిపడ్డారు. ఆయన చెప్పినట్లుగా ప్రభుత్వం నడుచుకోవాలా ఇదేం విడ్డూరం అని ఎద్దేవా చేశారు. గవర్నర్‌కు సలహాలు ఇచ్చే స్థాయి ఆయనకు లేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని లెక్క చేయని నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా గుర్తించబోమని తెలిపారు.