స్వదేశానికి కోహ్లీ

ABN , First Publish Date - 2020-12-23T07:05:00+05:30 IST

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పితృత్వ సెలవుపై మంగళవారం ఉదయం స్వదేశానికి బయలుదేరాడు. దీంతో మిగిలిన మూడు టెస్టులకూ అతడు దూరమవుతున్న విషయం తెలిసిందే

స్వదేశానికి కోహ్లీ

అడిలైడ్‌: భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పితృత్వ సెలవుపై మంగళవారం ఉదయం స్వదేశానికి బయలుదేరాడు. దీంతో మిగిలిన మూడు టెస్టులకూ అతడు దూరమవుతున్న విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందు సహచర ఆటగాళ్లతో సమావేశమై వారిలో నమ్మకాన్ని నింపాడు. ‘కోహ్లీ భారత్‌కు వస్తున్నాడు. అలాగే తొలి టెస్టులో దారుణ పరాజయం తర్వాత ఆటగాళ్లతో మాట్లాడి వారిలో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నం చేశాడు.అటు రహానెకు అధికారికంగా కెప్టెన్సీని అప్పగించాడు.


రెండో టెస్టులో ఎవరికి వారు తమ సత్తాను నిరూపించుకోవాలని కోరాడు. రోహిత్‌ ఈ టెస్టు తర్వాత జట్టుతో కలుస్తాడు’ అని బోర్డు వర్గాలు తెలిపాయి. మరోవైపు కోహ్లీ భారత్‌కు వెళ్లడాన్ని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ స్వాగతించాడు. జీవితంలోని మధుర క్షణాలను ఆస్వాదించే హక్కు అతడికుందని తెలిపాడు. ఒకవేళ ఇక్కడే ఉంటే అతడిపై చాలా ఒత్తిడి ఉండేదని అన్నాడు.

Updated Date - 2020-12-23T07:05:00+05:30 IST