Advertisement
Advertisement
Abn logo
Advertisement

రూట్ క్రీజులోకి రాగానే కోహ్లీ వెంటనే ఆ పని చేయాలి: మాంటీ పనేసర్

లండన్: ఈ సిరీస్‌లో అదిరిపోయే ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ను అవుట్ చేసేందుకు టీమిండియా బౌలర్లు చెమటోడుస్తున్నారు. అయితే, అతడిని ఎలా పెవిలియన్ పంపొచ్చో ఆ జట్టు మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ చెప్పుకొచ్చాడు. ఈ మేరకు టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి కీలక సూచన చేశాడు. భారత్‌తో లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 180 పరుగులు చేసిన రూట్, రెండో ఇన్నింగ్స్‌లో 33 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఈ టెస్టులో ఇండియా 151 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న రూట్‌ను అవుట్ చేయాలంటే.. అతడు క్రీజులోకి రాగానే వెంటనే బుమ్రా చేతికి బంతి ఇవ్వవాలని కోహ్లీకి పనేసర్ సూచించాడు. ఫిఫ్త్ స్టంప్‌లైన్‌లో ఆఫ్‌స్టంప్‌కు ఆవల బంతిని విసిరిన బుమ్రా ఇంగ్లండ్ కెప్టెన్‌ను పెవిలియన్ పంపాడని పేర్కొన్నాడు. కోహ్లీ చెప్పిన ప్లాన్‌ను బుమ్రా చక్కగా అమలు చేశాడని ప్రశంసించాడు. తర్వాత కూడా విరాట్ ఇలానే చేయాలని, రూట్ క్రీజులోకి రాగానే బుమ్రా చేతికి బంతి అందివ్వాలని పనేసర్ సూచించాడు. రూట్ షార్ట్ బాల్స్‌ను చక్కగా ఆడతాడని, కాబట్టి అతడికి షార్ట్ పిచ్ బంతులు సంధించవద్దని పేర్కొన్నాడు.  

Advertisement
Advertisement