Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘రోహిత్ గురించి జర్నలిస్ట్ ప్రశ్న.. కోహ్లీ దిమ్మతిరిగే సమాధానం

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. చరిత్ర తిరగరాయడమే కాకుండా, పాకిస్తాన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ ఈ మ్యాచ్‌లో విజయం దక్కించుకుంది. భారత బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే టీమిండియా ఓడిందనడంలో ఆశ్చర్యం లేదు. దారుణ ఓటమి తర్వాత జరిగిన మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడాడు. తమ ఓటమికి గల కారణాలను వివరిస్తూ.. రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చాడు. అప్పుడే ఓ రిపోర్టర్.. ‘రోహిత్ చాలా పేలవంగా ఆడాడు కదా.. అతడి స్థానంలో ఇషాన్ కిషన్‌ని ఆడిస్తే బాగుండేది. ఏమంటారు..?’ అని ప్రశ్నించాడు.

ఈ ప్రశ్నకు కోహ్లీ మొదట షాకయ్యాడు. కానీ కొద్ది సేపటికే తేరుకుని ఆ రిపోర్టర్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. ‘మీరు చాలా ధైర్యంగా ప్రశ్నించారు. కానీ ఇది అవసరం లేని ప్రశ్న. మీకు ఏదైనా కాంట్రవర్సీ కావాలంటే నాకు ముందుగా చెప్పండి. దానికి అనుగుణంగా సమాధానం ఇస్తాను. అంతేకానీ.. ఇలా అడిగితే నేనేమీ చెప్పలేను’ అని కోహ్లీ కౌంటర్ ఇచ్చాడు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement