Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్టోక్స్ దారిలోనే ఇంకొందరూ వెళ్తారు: కోహ్లీ

లండన్: క్రికెట్ నుంచి కొంత విరామం తీసుకుంటున్నట్లు ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. స్టోక్స్ నిర్ణయాన్ని ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా సమర్థించాడు. అయితే తాజాగా స్టోక్స్ నిర్ణయంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. స్టోక్స్ ఒక్కడే కాదని, భవిష్యత్తులో మరికొంతమంది ఆటగాళ్లు కూడా ఇలా క్రికెట్ నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకుంటారని చెప్పుకొచ్చాడు.  ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కోహ్లీ.. ‘స్టోక్స్ ఆలోచనను సమర్థిస్తున్నా. అతడు మాత్రమే కాదు మునుముందు మరికొంతమంది ఆటగాళ్లు కూడా క్రికెట్ నుంచి కొంత విరామం తీసుకుంటారు. అలా తీసుకోవడం ఆటగాళ్లకు అవసరమే కాదు తప్పనిసరి కూడా. కోవిడ్ నేపథ్యంలో బయోబబుల్‌లో ఉండి ఆడడానికి అనేకమంది ఆటగాళ్లు రాను రాను విసిగిపోతారు. అందుకే ఇలాంటి విరామాలు తీసుకోక తప్పదు’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

Advertisement
Advertisement