పోలీసు రాజ్యం నడుస్తుంది: కొలికపూడి శ్రీనివాసరావు

ABN , First Publish Date - 2021-08-08T22:11:02+05:30 IST

రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందని ఏపీ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు దుయ్యబట్టారు. అమరావతిలో పోలీసులే మూడు

పోలీసు రాజ్యం నడుస్తుంది: కొలికపూడి శ్రీనివాసరావు

అమరావతి: రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందని  ఏపీ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు దుయ్యబట్టారు. అమరావతిలో పోలీసులే మూడు రాజధానుల ఉద్యమాన్ని నడిపిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్‌రెడ్డి ప్రభుత్వం రెండేళ్లకే ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. పోలీసుల సహాయంతో పరిపాలన సాగిస్తున్నారని కొలికపూడి శ్రీనివాసరావు తప్పుబట్టారు.


మరోవైపు రాజధాని పరిధిలోని గ్రామాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. రాజధాని గ్రామాల్లోకి ఇతరులను అనుమతించేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. రాజధాని అమరావతి ఉద్యమానికి నేటితో 600 రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతి ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీకి పిలుపునిచ్చారు. న్యాయస్థానం నుంచి మంగళగిరి ఆలయం వరకు మహిళలు, రైతులు ర్యాలీగా వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ తరుణంలో ఉద్యమకారులు చేపట్టనున్న ర్యాలీకి పోలీసులు అనుమతిని నిరాకరించారు.

Updated Date - 2021-08-08T22:11:02+05:30 IST