పేదల రక్తం తాగుతున్న ప్రభుత్వాలు: కొల్లు రవీంద్ర

ABN , First Publish Date - 2021-02-08T21:57:59+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచి పేదల రక్తం తాగుతున్నాయని మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేదల రక్తం తాగుతున్న ప్రభుత్వాలు: కొల్లు రవీంద్ర

కృష్ణా: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచి పేదల రక్తం తాగుతున్నాయని మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడంపై మచిలీపట్నం తెలుగుదేశం శ్రేణుల ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. అయితే టీడీపీ నేతలు చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాయమాటలతో ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. కుడి చేతితో అమ్మఒడి డబ్బులు ఇచ్చి ఎడమ చేతితో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ధరలతో సామాన్య ప్రజలపై ఆర్ధిక భారం పడుతోందన్నారు. టీడీపీ హయాంలో ఇలాగే ధరలు పెరిగితే ఆ భారం ప్రజలపై పడకుండా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చూశారని చెప్పారు.  జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రజలను ధరల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పెంచిన ధరలను తగ్గించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కొల్లు రవీంద్ర  డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-02-08T21:57:59+05:30 IST