Abn logo
Apr 9 2021 @ 19:43PM

పువ్వాడ అజయ్‌కు వార్నింగ్ ఇచ్చిన కొండా రాఘవరెడ్డి

ఖమ్మం: మంత్రి పువ్వాడ అజయ్‌కు వైఎస్ షర్మిల అనుచరుడు కొండా రాఘవరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ అజయ్‌పై  విమర్శలు గుప్పించారు. అజయ్ చీల్లర మల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. సంకల్ప సభను చూసి మీ పునాదులు కదులుతున్నాయని, భయంతోనే సభకు వచ్చేవారిని అడ్డుకుంటున్నారని కొండా రాఘవరెడ్డి ధ్వజమెత్తారు. అంతకుముందు డీజీపీ మహేందర్‌రెడ్డిపై కొండా రాఘవరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. డీజీపీ టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోవాలని దుయ్యబట్టారు. సభకు వచ్చేవారిని ఎందుకు అడ్డుకుంటున్నారు? అని కొండా రాఘవరెడ్డి ప్రశ్నించారు.