Abn logo
Jun 24 2021 @ 11:08AM

తెలంగాణ ప్రభుత్వ లేఖపై స్పందించిన కృష్ణ రివర్ బోర్డు

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వ లేఖపై కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు స్పందించింది. రామలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపాలంటూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ మేరకు జలవనరుల శాఖ కార్యదర్శికి బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్ మీనా లేఖ రాశారు. డీపీఆర్ ఇవ్వకుండా రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టరాదని  బోర్డు స్పష్టం చేసింది. అత్యున్నత మండలి ఆమోదం లేకుండా ఎత్తిపోతల పనులు చేపట్టరాదని పేర్కొంది. ప్రాజెక్టు ప్రాంతంలో తమ బృందం పర్యటనకు ఏపీ ప్రభుత్వం సహకరించలేదని గుర్తుచేసింది.