Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆదివారం నుంచి Kuwait కు ట్రాఫిక్ కష్టాలు.. కారణమిదే!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌కు ఆదివారం(అక్టోబర్ 3) నుంచి ట్రాఫిక్ కష్టాలు మొదలు కాబోతున్నాయి. ఎందుకంటే ఈ ఆదివారం నుంచి అక్కడ అరబిక్ స్కూల్స్ ప్రారంభం అవుతున్నాయి. కరోనా కారణంగా ఇన్నాళ్లు బోసిపోయిన కువైత్ రోడ్లపై మళ్లీ రద్దీ పెరగనుంది. ఇక ఇటీవల ప్రారంభమైన విదేశీ స్కూల్స్ కారణంగా ఇప్పటికే రోడ్లపై ట్రాఫిక్ కొంచెం పెరిగింది. ఈ ఆదివారం నుంచి అరబిక్ స్కూల్స్ సైతం ప్రారంభమవుతుండడంతో భారీగా ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. 

కాగా, ఈ స్కూళ్ల ప్రారంభంతో సుమారు 5.20లక్షల మంది విద్యార్థులు పబ్లిక్, ప్రైవేట్ పాఠశాలలకు తిరిగి వెళ్లనున్నారు. దీంతో స్కూల్ బస్సులు, ప్రైవేట్ వాహనాలు భారీ సంఖ్యలో తిరిగి రోడ్డు ఎక్కనున్నాయి. అందుకే ఇంతకుముందులానే మళ్లీ రోడ్లపై రద్దీ పెరగనుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ అధికారులు ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. పాఠశాల ప్రారంభానికి స్వాగతం పలకడానికి ట్రాఫిక్ విభాగం అన్ని సన్నాహాలు చేసింది. ట్రాఫిక్‌ను నియంత్రించడానికి భారీ సంఖ్యలో పెట్రోల్ వాహనాలను ప్రధాన రహదారులు, పాఠశాలల దగ్గర ఉంచింది.

అటు కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు అంతర్గత మంత్రిత్వశాఖ అండర్ సెక్రెటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైజల్ అల్ నవాఫ్ పేర్కొన్నారు. ఆదివారం నుంచి అరబిక్ స్కూల్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ అంశాలపై సంబంధిత అధికారులతో ఆయన తాజాగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ ఫైజల్ మాట్లాడుతూ క్షేత్ర భద్రతా విభాగాలు విద్యా సంవత్సరానికి తమ సన్నాహాలను పూర్తి చేశాయని చెప్పారు. అలాగే అన్ని ప్రధాన, సెకెండరీ రోడ్లపై ట్రాఫిక్ విషయమై తమ విభాగం అప్రమత్తంగా ఉందని తెలిపారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement