Advertisement
Advertisement
Abn logo
Advertisement

వలసదారులకు Kuwait నుంచి పండగలాంటి వార్త.. మరికొద్ది రోజుల్లోనే..

కువైట్: కరోనాకు మందు అరబ్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ 4 రాళ్లు సంపాదించుకున్న అనేకమంది వలసదారులను కోవిడ్ మహమ్మారి తీవ్రంగా దెబ్బ కొట్టింది. ఎంతోమంది వలసదారులు ఉద్యోగాలు కోల్పోయి అక్కడి నుంచి స్వదేశాలకు వెళ్లిపోయారు. అందులో భారత్‌కు చెందిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. ఈ క్రమంలోనే కువైట్ సదరు వలసదారులకు ఓ గుడ్ న్యూస్ ప్రకటించింది. దీంతో ఇప్పుడు వలసదారుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఆ దేశ విమానాయాన శాఖ.. కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ(కేసీఏఏ) మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్, ఈజిప్ట్ దేశాలతో పాటు హరో 4 దేశాల నుంచి కమర్షియల్ విమానాలను రాకపోకలను పునరుద్ధరించబోతున్నారు. 

ఈ మేరకు మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. కేసీఏఏ ప్రధాన అధికారి మన్సూర్ అల్ హషెమీ మీడియాతో మాట్లాడుతూ.. విమానాయాన సంస్థల పనితీరుకు సంబంధించి ఇటీవల మంత్రి మండలి ప్రకటించిన నిర్ణయాన్ని అమలు చేసే విధంగా విమానాయాన సంస్థలు సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవడంపై ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.

కాగా.. ఇటీవల జరిగిన కువైట్ మంత్రి మండలి సమావేశంలో మంత్రులంతా విమాన సేవల పునరుద్ధరణపై ఓ నిర్ణయం ప్రకటించారు. అందులో భారత్, ఈజిప్ట్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ దేశాల నుంచి పూర్తి స్థాయిలో కమర్షియల్ విమానాలను అనుమతించేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎప్పటి నుంచి ఇది అమలులోకి వస్తుందో కచ్చితమైన తేదీని మాత్రం ప్రకటించలేదు. ఎప్పటి నుంచి విమాన సేవలు ప్రారంభించబోతున్నామో త్వరలో వెల్లడిస్తామని హషేమి పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే భారత్, ఈజిప్ట్, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల నుంచి దాదాపు 3.3 మిలియన్ల(33 లక్షలు) మంది కువైత్‌లో ఉద్యోగాలు చేసేవారు. కువైత్‌లో ఉద్యోగాలు చేసే విదేశీయులలో వీరు దాదాపు 70 శాతం. విమాన సేవలు తిరిగి ప్రారంభమైతే ఒక్కసారిగా వీరంతా తిరిగి అక్కడికి ప్రయాణం అయ్యే అవకాశాలున్నాయి. అయితే కువైత్ వలసదారుల నిబంధనల ప్రకారం ప్రతి రోజూ 7,500 మందిని మాత్రమే దేశంలోకి అనుమతించడం జరుగుతుంది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిమితిని కూడా  పెంచాలని మంత్రి మండలిని కేసీఏఏ కోరింది. మరి కువైత్ వెళ్లాలనుకునేవారంతా ఇక రెడీగా ఉండండి.

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement