Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ సెక్టార్ వారికి Kuwait తీపి కబురు..

కువైత్ సిటీ: ఫుడ్ సెక్యూరిటీ సెక్టార్ల వారికి గల్ఫ్ దేశం కువైత్ తీపి కబురు చెప్పింది. ఫుడ్ సెక్యూరిటీ సెక్టార్లకు చెందిన వారికి ఎంట్రీ వీసాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కరోనాపై ఏర్పాటైన మంత్రివర్గ కమిటీ తాజాగా ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా వ్యవసాయం, రెస్టారెంట్లు, క్యాటరింగ్, బేకరీలు, చేపలు పట్టడం, పశువులు మరియు పౌల్ట్రీ పెంపకం, పాల ఉత్పత్తి, ఆహార మార్కెటింగ్, వాటర్ బాట్లింగ్‌లో పనిచేసే వారికి ఎంట్రీ వీసాలు ఇవ్వనుంది. అయితే, విదేశీ ప్రయాణికులకు ప్రభుత్వం విధించిన వ్యాక్సినేషన్, ఇతర ఆరోగ్య నిబంధనలు పాటించడం తప్పననిసరి అని పేర్కొంది. 

కాగా, ప్రపంచవ్యాప్త మహమ్మారి ఆంక్షల ఫలితంగా కువైత్ కొన్ని వృత్తులలో కార్మికుల కొరతను ఎదుర్కొంటున్న విషయం విదితమే. దేశం నుంచి చాలా మంది విదేశీ కార్మికులు స్వదేశాలకు వెళ్లడం అక్కడే చిక్కుకుపోవడంతో ఈ సంక్షోభం ఏర్పడింది. తద్వారా ఆర్థిక పతనం మొదలైంది. దీంతో తాజాగా కువైత్ సర్కార్ దిద్దుబాటు చర్యలు మొదలెట్టింది. దీనిలో భాగంగా దాదాపు ఏడు నెలల తర్వాత ఆగస్టు 1 నుంచి ప్రవాసుల రాకపై ఉన్న బ్యాన్‌ను తొలగించింది. ఆ దేశంలో ఆమోదం పొందిన ఫైజర్-బయోఎన్‌టెక్, ఆక్స్‌ఫర్డ్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లలో ఏదో ఒకటి రెండు డోసుల తీసుకున్న వారు కువైత్‌ వెళ్లొచ్చు. అలాగే సినోఫార్మ్, సినోవాక్, స్పుత్నిక్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న ప్రయాణికులు కువైత్ గుర్తించిన వ్యాక్సిన్లలో మూడో డోస్ తీసుకుంటే శంలోకి ఎంట్రీ ఉంటుంది.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement