Kuwaitలో ఇక జైల్ ఫ్రమ్ హోమ్.. అమల్లోకి సరికొత్త నిబంధన.. వాళ్లందరికీ బెన్‌ఫిట్.. కండిషన్స్ ఏంటంటే..

ABN , First Publish Date - 2021-09-14T15:04:01+05:30 IST

ఇప్పటివరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం, విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఫ్రం హోం ఇలాంటివి ఎన్నో చూసుంటారు. అయితే ఎప్పుడైనా ఖైదీలకు జైల్ ఫ్రం హోం గురించి విన్నారా..? ఆశ్చర్యపడకండి.. ఇది నిజంగా సాధ్యం చేయబోతోంది కువైత్ ప్రభుత్వం. ఇప్పటికే అనేక నేరాల్లో ఖైదీలుగా శిక్షలు అనుభవిస్తున్న వారు తమ జైలు శిక్షను ఇంటి నుంచి అనుభవించేలా ఉత్తర్వులు జారీ చేసింది.

Kuwaitలో ఇక జైల్ ఫ్రమ్ హోమ్.. అమల్లోకి సరికొత్త నిబంధన.. వాళ్లందరికీ బెన్‌ఫిట్.. కండిషన్స్ ఏంటంటే..

కువైత్ సిటీ: ఇప్పుడు చెప్పబోయే విషయం మీరు జీవితంలో వినుండరు. విషయం తెలియగానే ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు. కరోనా దెబ్బకు చాలా విషయాలు తలకిందులవుతున్నాయి. ఇప్పటివరకు ఎన్నడూ కనీ వినీ ఎరుగని పరిస్థితులు మనచుట్టూ సంభవిస్తున్నాయి. అందులో భాగంగానే ఆఫీసులకు వెళ్లకుండా ఇళ్ల నుంచే ఉద్యోగులు పనిచేయడం.. పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లకుండానే విద్యార్థినీ, విద్యార్థులు ఆన్‌లైన్‌లో పాఠాలు వినడం లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇప్పటివరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం, విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఫ్రం హోం ఇలాంటివి ఎన్నో చూసుంటారు. అయితే ఎప్పుడైనా ఖైదీలకు జైల్ ఫ్రం హోం గురించి విన్నారా..? ఆశ్చర్యపడకండి.. ఇది నిజంగా సాధ్యం చేయబోతోంది కువైత్ ప్రభుత్వం. ఇప్పటికే అనేక నేరాల్లో ఖైదీలుగా శిక్షలు అనుభవిస్తున్న వారు తమ జైలు శిక్షను ఇంటి నుంచి అనుభవించేలా ఉత్తర్వులు జారీ చేసింది.


అయితే కొత్త నిబంధనలకు కొన్ని షరతులు కూడా ఉన్నాయి. 3 ఏళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పడిన ఖైదీలే ఈ జైల్ ఫ్రం హోం వినియోగించుకునేందుకు అర్హులు. ఇంట్లో ఉండి శిక్ష అనుభవించే సమయంలో వారికి ఓ ఎలక్ట్రానిక్ డివైజ్ అమరుస్తారు. దాని ద్వారా వారు ఇంట్లో గడుపుతున్న జైలు సమయాన్ని లెక్కిస్తారు. ఈ విధానం గురించి మేజర్ జనరల్ తలాల్ మారఫి ప్రకటించారు. దీనిని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఖైదీలకు మానవత్వంతో కూడిన సేవలను అందించడంలో భాగంగానే ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ తామెర్ అల్ అలి పేర్కొన్నారు. అంతకుముందు హోమ్ సెక్రటరీ షేక్ ఫైజల్ కూడా ఈ ప్రతిపాదనను ఆమోదించారు. దీంతో ఇకపై కువైత్‌లో అనేకమంది ఖైదీలు జైల్ ఫ్రం హోం సౌలభ్యాన్ని అనుభవించనున్నారు.

Updated Date - 2021-09-14T15:04:01+05:30 IST