భారతీయ ప్రయాణికులకు Kuwait గుడ్‌న్యూస్.. వీక్లీ కోటా భారీగా పెంపు!

ABN , First Publish Date - 2021-09-02T14:20:41+05:30 IST

భారతీయ ప్రయాణికులకు కువైత్ గుడ్‌న్యూస్ చెప్పింది. డైరెక్ట్ విమానాల ద్వారా కువైత్ వచ్చే భారతీయుల వీక్లీ కోటాను భారీగా పెంచింది. గత వారం ఈ కోటాను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కేవలం 760 సీట్లుగా మాత్రమే పేర్కొంది. తాజాగా ఈ కోటాను ఏకంగా 5,528 సీట్లకు పెంచింది.ఈ మేరకు భారత పౌర విమానయాన శాఖకు కువైత్ డీజీసీఏ..

భారతీయ ప్రయాణికులకు Kuwait గుడ్‌న్యూస్.. వీక్లీ కోటా భారీగా పెంపు!

కువైత్ సిటీ: భారతీయ ప్రయాణికులకు కువైత్ గుడ్‌న్యూస్ చెప్పింది. డైరెక్ట్ విమానాల ద్వారా కువైత్ వచ్చే భారతీయుల వీక్లీ కోటాను భారీగా పెంచింది. గత వారం ఈ కోటాను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కేవలం 760 సీట్లుగా మాత్రమే పేర్కొంది. తాజాగా ఈ కోటాను ఏకంగా 5,528 సీట్లకు పెంచింది. ఈ మేరకు భారత పౌర విమానయాన శాఖకు కువైత్ డీజీసీఏ బుధవారం ప్రత్యేకంగా ఓ లేఖను పంపింది. ఇక కరోనా ఆంక్షలు తొలగించిన తర్వాత కువైత్ ఇటీవల ఎయిర్‌పోర్టుకు డైలీ రావాల్సిన ప్రయాణికుల సామర్థ్యాన్ని 10వేలకు పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భారత్ నుంచి కువైత్‌కు వచ్చే ప్రయాణికుల కోటాను తాజాగా ప్రకటించింది. 


వీక్లీ కువైత్‌కు 5,528 మంది భారతీయ ప్రయాణికులు రావొచ్చని డీజీసీఏ డైరెక్టర్ యూసఫ్ అల్ ఫౌజాన్ వెల్లడించారు. అలాగే ఈ కోటాలో కువైత్ క్యారియర్లు, భారతీయ విమాన సర్వీసులకు చెరో 2,764 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అదే విధంగా రోజువారీగా సీట్ల వివరాలను కూడా ప్రకటించారు. ఆదివారం(656), సోమవారం(1,112), మంగళవారం(648), బుధవారం(648), గురువారం(1,088), శుక్రవారం(638), శనివారం(738) సీట్లు ఉన్నాయి. ఈ రోజువారీ సీట్లలో భారత్, కువైత్ క్యారియర్లు చెరో సగం పంచుకోవాల్సి ఉంటుందని యూసఫ్ అల్ ఫౌజాన్ తెలిపారు.    

Updated Date - 2021-09-02T14:20:41+05:30 IST