రెసిడెన్సీ పర్మిట్ గడువు ముగిసిన ప్రవాసులపై కువైత్ ఉక్కుపాదం!

ABN , First Publish Date - 2021-08-14T16:19:13+05:30 IST

రెసిడెన్సీ పర్మిట్ గడువు ముగిసిన ప్రవాసులపై కువైత్ కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులేస్తోంది. రెసిడెన్సీ గడువు ముగిసినా, ఇంకా దేశంలోనే ఉంటున్న వారిని బహిష్కరించేందుకు జలీబ్ అల్ షుయౌఖ్ ఆధ్వర్యంలోని కువైత్ మినిస్టరీయల్ కమిటీ సిద్ధమవుతోంది.

రెసిడెన్సీ పర్మిట్ గడువు ముగిసిన ప్రవాసులపై కువైత్ ఉక్కుపాదం!

కువైత్ సిటీ: రెసిడెన్సీ పర్మిట్ గడువు ముగిసిన ప్రవాసులపై కువైత్ కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులేస్తోంది. రెసిడెన్సీ గడువు ముగిసినా, ఇంకా దేశంలోనే ఉంటున్న వారిని బహిష్కరించేందుకు జలీబ్ అల్ షుయౌఖ్ ఆధ్వర్యంలోని కువైత్ మినిస్టరీయల్ కమిటీ సిద్ధమవుతోంది. అలాగే కమర్షియల్ లైసెన్స్ లేకుండా పనిచేస్తున్న కార్మికులు, అనుమతి లేకుండా నడుస్తున్న ఫుడ్ మార్కెట్లపై కూడా చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా కమిటీ వెల్లడించింది. ఇక ప్రవాసులు అన్ని నిబంధనలకు లోబడి ఉండేలా పర్యవేక్షించేందుకు 2019లో కువైత్ మినిస్టరీయల్ కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే.


అంతర్గత శాఖ, మున్సిపల్ శాఖ, పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) శాఖను ఈ కమిటీలో భాగం చేసింది కువైత్. దీనిలో భాగంగా దేశంలో కొన్నేళ్లుగా సరియైన అనుమతులు లేకుండా ఫుడ్ మార్కెట్లు నడుస్తున్నాయని, ప్రధానంగా కార్మికులు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఇవి ఉన్నట్లు కమిటీ గుర్తించింది. అలాగే కమర్షియల్ లైసెన్స్ లేకుండా కూడా చాలా మంది కార్మికులు పనిచేస్తున్నట్లు తేల్చింది. దీంతో రెసిడెన్సీ పర్మిట్ గడువు ముగిసిన వారితో పాటు అనుమతిలేని ఫుడ్ మార్కెట్లు, కమర్షియల్ లైసెన్స్ లేని కార్మికులపై కమిటీ కఠిన చర్యలకు రెడీ అవుతోంది.               

Updated Date - 2021-08-14T16:19:13+05:30 IST