హైదరాబాద్‌ను డల్లాస్‌ చేస్తామన్నారు.. ఏమైంది?: ఎల్‌.రమణ

ABN , First Publish Date - 2020-10-21T20:27:16+05:30 IST

ఖమ్మం: వరదల వల్ల హైదరాబాద్‌ అతలాకుతలం అయినా.. కనీసం సీఎం ప్రజల వద్దకు వెళ్లి

హైదరాబాద్‌ను డల్లాస్‌ చేస్తామన్నారు.. ఏమైంది?: ఎల్‌.రమణ

ఖమ్మం: వరదల వల్ల హైదరాబాద్‌ అతలాకుతలం అయినా.. కనీసం సీఎం ప్రజల వద్దకు వెళ్లి పరామర్శించింది లేదని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పేర్కొన్నారు. ఇంత వరకు పంట నష్టాన్ని అంచనా వేయలేదన్నారు. కేసీఆర్‌ మెడలు వంచి నష్టపరిహారం రైతులకు ఇప్పిస్తామన్నారు. రైతు బీమా ద్వారా రైతులకు చెల్లింపులు చేయాలన్నారు. తడిసిన ధాన్యం, ప్రత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రమణ డిమాండ్ చేశారు. నష్టపోయిన ప్రతి రైతుకు రూ.30 వేలు ఇవ్వాలన్నారు. సాయం పేరుతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ను డల్లాస్‌ చేస్తామన్నారని.. ఏమైందని ఎల్‌.రమణ ప్రశ్నించారు. 

Updated Date - 2020-10-21T20:27:16+05:30 IST