Abn logo
Aug 1 2021 @ 11:14AM

లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి బోనాలు

హైదరాబాద్‌: లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. పాతబస్తీలో ఘనంగా  బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. సింహవాహిని మహంకాళి మందిరానికి భక్తులు తరలివస్తున్నారు. బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లు, దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. బోనాల సందర్భంగా పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లించారు.