Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగన్ మరో అడుగు ముందుకేసి ప్రచారం చేసుకున్నారు: లంకా దినకర్

విజయవాడ: ప్రధాని మోదీ సారథ్యంలో పెట్రోల్, డీజీల్ సుంకాన్ని తగ్గించారని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. పెట్రోల్ 5, డీజిల్ లీటర్‌కి పది రూపాయల చొప్పున కేంద్రం, కొన్ని రాష్ట్రాలు అమలు చేశాయన్నారు. ఏపీ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు మాత్రం ప్రశాంత్ కిషోర్ సూచనలు మాత్రమే అమలు చేస్తున్నారని చెప్పారు. మన సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం మరో అడుగు ముందుకేసి ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. తాను తగ్గించాల్సిన అవసరం లేదని ప్రజా ధనంతో పేపర్లో ప్రకటన ఇస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు అర్ధం కాకుండా పర్సంటేజీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement