ఇది రాజ్యాంగపరమైన హక్కులను తుంగలో తొక్కడమే: లంకా దినకర్‌

ABN , First Publish Date - 2021-05-15T10:00:49+05:30 IST

ఏపీ నుంచి తెలంగాణ వెళ్లే అంబులెన్సులను అడ్డుకోవడం అంటే ఏపీ ప్రజల రాజ్యాంగ, చట్టపరమైన హక్కులను తుంగలో తొక్కేయడమేనని బీజేపీ నేత లంకా దినకర్‌..

ఇది రాజ్యాంగపరమైన హక్కులను తుంగలో తొక్కడమే: లంకా దినకర్‌

అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): ఏపీ నుంచి తెలంగాణ వెళ్లే అంబులెన్సులను అడ్డుకోవడం అంటే ఏపీ ప్రజల రాజ్యాంగ, చట్టపరమైన హక్కులను తుంగలో తొక్కేయడమేనని బీజేపీ నేత లంకా దినకర్‌ అన్నారు. శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం, సెక్షన్‌ 5 ప్రకారం, హైదరాబాద్‌ 10 సంవత్సరాల... అంటే 2 జూన్‌ 2024 వరకు ఉమ్మడి రాజధానిగా ఉందన్నారు. మరోవైపు తెలంగాణ హైకోర్టు ఆంబులెన్సులను అడ్డుకోవద్దని స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. అయినప్పటికీ అడ్డుకోవడం దారుణమన్నారు. సీఎం జగన్‌, ప్రతిపక్షనేత చంద్రబాబు ఈ విషయంలో కేసీఆర్‌ను ఎందుకు నిలదీయడంలేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లపాటు కొనసాగించేందుకు చట్టసవరణ అవసరమని దినకర్‌ అన్నారు. 

Updated Date - 2021-05-15T10:00:49+05:30 IST