Advertisement
Advertisement
Abn logo
Advertisement

సిమ్లా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానేనా?: లంకా దినకర్

అమరావతి:  సీఏం జగన్మోహన్‌రెడ్డి ఎక్కడ ఉంటే అదే రాజధాని అయినప్పుడు ఇక మూడు రాజధానులని అనడం ఎందుకు? అని బీజేపీ నేత లంకా దినకర్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గడచిన నాలుగు రోజులు సీఎం జగన్ సిమ్లాలో ఉన్నారు, సిమ్లా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానేనా? అని  వైసీపీ నేతలను నిలదీశారు. పెట్రోల్ ధరలపైన కేంద్రం వివరణతో రాజధాని  అంశాన్ని తప్పుగా ప్రచారం చేద్దామనుకున్నారన్నారు. కాని ఇంతలోనే కేంద్రం స్పష్టత ఇవ్వడంతో వైసీపీ నాయకులు నాలిక కరుచుకున్నారని చెప్పారు. కోర్ట్‌లో ఉన్న అంశంపై అసందర్భంగా మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారంటే  ప్రభుత్వం  ఏదో వత్తిడిలో ఉందని అర్ధమవుతుందని లంకా దినకర్ అన్నారు. 

Advertisement
Advertisement