పంప్‌హౌ్‌సల నుంచి ఎత్తిపోతలు షురూ

ABN , First Publish Date - 2021-01-18T09:12:28+05:30 IST

యాసంగి సాగు అవరాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టులోని పలు పంప్‌హౌ్‌సల నుంచి నీటి ఎత్తిపోతలు ఆదివారం ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలోని సరస్వతి పంప్‌హౌ్‌సలోని రెండు

పంప్‌హౌ్‌సల నుంచి ఎత్తిపోతలు షురూ

లక్ష్మీ పంప్‌హౌస్‌ వద్ద రెండు మోటార్ల ప్రారంభం


మంథని రూరల్‌/ధర్మారం/మహదేవపూర్‌, జనవరి 17: యాసంగి సాగు అవరాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టులోని పలు పంప్‌హౌ్‌సల నుంచి నీటి ఎత్తిపోతలు ఆదివారం ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలోని సరస్వతి పంప్‌హౌ్‌సలోని రెండు మోటార్ల ద్వారా ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 6 వేల క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోశారు. ఇక్కడి నుంచి ధర్మారం మండలంలోని నంది పంప్‌హౌ్‌సలోకి, డెలివరీ సిస్టర్న్‌ ద్వారా 3,150 క్యూసెక్కుల నీటిని నంది రిజర్వాయర్‌లోకి ఎత్తిపోశారు. ఇక్కడి నుంచి కరీంనగర్‌ జిల్లా లక్ష్మీపూర్‌ సమీపంలోని గాయత్రి పంప్‌హౌ్‌సలోకి నీటిని విడుదల చేశారు. అలాగే గాయత్రి పంప్‌హౌస్‌ నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి 3,150 క్యూసెక్కుల నీటిని తరలించారు. అక్కడి నుంచి లోయర్‌ మానేరు డ్యాంకు మూడువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అలాగే భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీ పంప్‌హౌజ్‌ వద్ద రెండు మోటార్లను అధికారులు ఆదివారం ప్రారంభించారు. వీటితో 4,200 క్యూసెక్కులను సరస్వతీ బ్యారేజీకి ఎత్తిపోస్తున్నారు. 

Updated Date - 2021-01-18T09:12:28+05:30 IST