లావా లాంఛింగ్ ఆఫర్.. ఒక్క రూపాయికే ఇయర్ బడ్స్
ABN , First Publish Date - 2021-06-23T22:47:11+05:30 IST
ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ లావా ఒక్క రూపాయికే ఇయర్ బడ్స్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. అది కూడా వైర్ లెస్ ఇయర్ బడ్స్‌ను అత్యంత తక్కువ ధరకు ఇస్తుండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ లావా ఒక్క రూపాయికే ఇయర్ బడ్స్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. అది కూడా వైర్ లెస్ ఇయర్ బడ్స్‌ను అత్యంత తక్కువ ధరకు ఇస్తుండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వైర్‌లెస్ విభాగంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా లావా ఈ ఆఫర్‌ను ప్రకటించింది. జూన్ 24 మధ్యాహ్నం 12 గంటల నుంచి లావా ఈ-కామర్స్ వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది.
లావా ప్రోబడ్స్ పేరుతో మార్కెట్లోకి రానున్న ఈ ఇయర్ బడ్స్ అసలు ధర రూ. 2199గా ఉంది. లాంఛింగ్ ఆఫర్‌లో రూ.1కే లభించనున్నాయి. నిర్ణీత స్టాక్ ఉన్నంత వరకే ఈ ఆఫర్‌కు లావా ప్రోబడ్స్ లభించనున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని లావా వీటిని లాంఛ్ చేసింది. ఇంటి నుంచే చదువుకుంటున్నవారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారి అవసరాలను ప్రోబడ్స్ తీరుస్తుందని లావా మొబైల్స్ పేర్కొంది.
లావా ప్రోబడ్స్ ఫీచర్స్
1. లావా ప్రోబడ్స్‌లో 11.6ఎంఎం అడ్వాన్స్‌డ్ డ్రైవర్స్ ఉంటాయి.
2. మీడియాటెక్ ఎయిరోహా చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.
3. లావా ప్రోబడ్స్‌లో ఒక బడ్‌లో 55ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 25 గంటల పాటు మ్యూజిక్ ప్లేటైమ్ వస్తుంది. 500ఎంఏహెచ్ కేస్ బ్యాటరీ ఉంటుంది.
4. లావా ప్రోబడ్స్‌లో 'వేక్ అండ్ పెయిర్' టెక్నాలజీ ఉంది.
5. లేటెస్ట్ బ్లూటూత్ v5.0 వర్షన్‌తో లావా ప్రోబడ్స్ పనిచేస్తుంది.
6. లావా ప్రోబడ్స్ బరువు 77గ్రాములు. IPX5 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.