ల‌క్ష్మీపంప్‌హౌజ్‌ నుంచి ఎత్తిపోతలు షురూ

ABN , First Publish Date - 2021-01-18T04:47:59+05:30 IST

ల‌క్ష్మీపంప్‌హౌజ్‌ నుంచి ఎత్తిపోతలు షురూ

ల‌క్ష్మీపంప్‌హౌజ్‌ నుంచి ఎత్తిపోతలు షురూ

మూడో టీఎంసీ అదనపు మోటార్లలో రెండింటిని ప్రారంభించిన అధికారులు

మహదేవపూర్‌, జనవరి 17: కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీల ఎత్తిపోతల్లో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో ల‌క్ష్మీపంప్‌హౌజ్‌వద్ద అదనంగా ఏర్పాటు చేసిన ఆరు మోటార్లలో రెండింటిని అధికారులు ఆదివారం ప్రారంభించారు. వీటితో గోదావరి నీటిని గ్రావిటీ కెనాల్‌ ద్వారా 4,200 క్యూసెక్కులను సరస్వతీ బ్యారేజీకి ఎత్తిపోస్తున్నారు. గడిచిన వానాకాలం పంట సమయంలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవడంతో కాళేశ్వరం ప్రాజెక్టు రివర్స్‌ పంపింగ్‌ అవసరం ఏర్పడలేదు. ఈ క్రమంలో 2020 ఆగస్టు 11న లక్ష్మీపం్‌పహౌ్‌సలోని 11 మోటార్లను నిలిపివేశారు. మూడో టీఎంసీకి సంబంధించి అదనంగా బిగించిన ఆరు మోటార్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల ప్రారంభించనుండగా ఆయన పర్యటన రద్దు అయ్యింది. ఈ క్రమంలో యాసంగికి నీటి అసవరం రీత్యా అధికారులు కొత్త ఏర్పాటు చేసిన ఆరు మోటార్లలో లింక్‌-1లోని రెండు మోటార్లను ప్రారంభించారు.  

Updated Date - 2021-01-18T04:47:59+05:30 IST