Advertisement
Advertisement
Abn logo
Advertisement

మోపాడుకు ముప్పు

  • వరద ఉధృతికి ప్రమాదకరంగా పారుతున్న అలుగు
  • ఐదుచోట్ల రిజర్వాయరు కట్టకు లీకులు
  • 8 గ్రామాలు ఖాళీచేసి సహాయక చర్యలు
  • ఉగ్ర నరసింహారెడ్డిని అడ్డుకున్న పోలీసులు


పామూరు, డిసెంబరు 1: ప్రకాశం జిల్లాలోనే అతిపెద్ద రిజర్వాయరు మోపాడుకు ప్రమాదం పొంచి ఉంది. గత రెండురోజుల నుంచి కురిసిన భారీవర్షాలతో వరద పోటెత్తడంతో రిజర్వాయర్‌లో పుష్కలంగా నీరు చేరింది. దాంతో అలుగు ఉధృతంగా పారుతోంది. అలాగే రిజర్వాయర్‌ కట్టకు ఐదుచోట్ల లీకేజీలు ఏర్పడ్డాయి. ఆ లీకేజీల ద్వారా నీరు బయట కు పోతుండటంతో కట్ట కింద ఉన్న గ్రామాల ప్రజ లు భయాందోళన చెందుతున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టినా నీరు ఆగడం లేదు.  చెరువు లోతట్టు ప్రాంతంలో వందలాది ట్రాక్టర్ల ద్వా రా మట్టిని తెచ్చి లీకేజీలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నీటిమట్టం తగ్గిస్తే లీకులు తగ్గుతాయనే ఆలోచనతో రిజర్వాయర్‌ అలుగు ప్రాంతా న్ని యంత్రాలతో పగులగొట్టి నీటిని బయటకు పం పిస్తున్నారు. ఎవరూ భయాందోళనలు చెందవద్దని, కట్ట తెగబోదని అధికారులు ధైర్యం చెబుతున్నారు. ముందుజాగ్రత్తగా కాలువకట్ట కింద ఉన్న గ్రామ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తల దాచుకోవాలని సూచించారు. ఈ సూచనలతో పలు కాలనీల ప్రజలు ఇళ్లను ఖాళీచేశారు.  


కట్ట వద్ద ఉద్రిక్తత.. మోపాడు రిజర్వాయర్‌ పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు కట్ట వద్దకు చేరుకున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కట్ట ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎందుకు అనుమతించరంటూ పోలీసులతో వాగ్యుద్ధం జరిపారు.  

Advertisement
Advertisement