Abn logo
Feb 14 2021 @ 03:24AM

సరదాగా ఉంటాం

కాజల్‌ తన స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లూను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె నటించిన ‘లైవ్‌ టెలికాస్ట్‌’ వెబ్‌సిరీస్‌ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా హాట్‌స్టార్‌ ఓటీటీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి తన జీవితంలో తెచ్చిన మార్పులను కాజల్‌ చెప్పుకొచ్చారు. గౌతమ్‌తో పెళ్లైన తర్వాత మునుపటి కన్నా జీవితం చాలా బాగుందన్నారు. వైవాహిక జీవితం ఇద్దరికీ మరింత ఆనందాన్ని పంచుతోందన్నారు.  ‘‘వ్యాపారంతో గౌతమ్‌, సినిమాలతో నేనూ బిజీగా ఉంటాం. కానీ ఇంటికొచ్చాక మాత్రం అవన్నీ పక్కనపెట్టి సరదాగా గడుపుతాం. అప్పుడప్పుడూ గౌతమ్‌ నా సినిమా షూటింగ్‌కు వస్తుంటారు. సెట్‌లో ఆయన్ను గౌరవంగా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని కాజల్‌ చెప్పారు.