‘స్థాయి’ తగ్గింది

ABN , First Publish Date - 2020-10-21T06:10:44+05:30 IST

అధ్యక్షులు, అధికారులు తప్ప ప్రశ్నించే సభ్యులు లేకుండానే జడ్పీ స్థాయి సంఘాల సమావేశాలు ముగిసిపోతున్నాయి.

‘స్థాయి’ తగ్గింది

సాదాసీదాగా జడ్పీ స్థాయి సంఘాల సమావేశం

అధికారులు, అధ్యక్షులు మాత్రమే హాజరు

ప్రగతి నివేదికలతో సరిపెట్టిన అధికారులు


ఖమ్మం కలెక్టరేట్‌, అక్టోబరు 20: అధ్యక్షులు, అధికారులు తప్ప ప్రశ్నించే సభ్యులు లేకుండానే జడ్పీ స్థాయి సంఘాల సమావేశాలు ముగిసిపోతున్నాయి. మంగళవారం ఖమ్మం జడ్పీ సమావేశ మందిరంలో స్థాయి సంఘాల సమావేశం జరిగింది. ఉదయం 5వ కమిటీ మహిళా శిశు సంక్షేమం కమిటీ అధ్యక్షురాలు దిరిశాల ప్రమీల, 6వ కమిటీ సాంఘిక సంక్షేమం కమిటీ అధ్యక్షురాలు మారోజు సుమలత అధ్యక్షతన నిర్వహించగా వీటికి జడ్పీ అధ్యక్షులు మాత్రమే హాజరయ్యారు. కమిటీల్లో సభ్యులు (జడ్పీటీసీలు) హాజరు కాలేదు. దీంతో అధికారులు తమ ప్రగతి నివేదికలను మాత్రమే చదివి మమ అనిపించేశారు. ఆ తర్వాత1వ కమిటీ, 7వ కమిటీ ఆర్థికం, పనుల కమిటీలు జడ్పీ అధ్యక్షుడు లింగాల కమల్‌రాజ్‌ అధ్యక్షతన నిర్వహించారు. వీటికి మాత్రం సభ్యులు హాజరయ్యారు. సాయంత్రం జరిగిన విద్యా వైద్యం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం స్థాయి సంఘాలకు కూడా సభ్యులు ఒకరొక్కరు మాత్రమే హాజరయ్యారు.


దీంతో స్థాయి సంఘాల సమావేశం తీరు తూతూ మంత్రంగానే సాగాయి. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో ప్రియాంక, డిప్యూటీ సీఈవో వింజం వెంకటఅప్పారావు, జడ్పీ ఉపాఽధ్యక్షురాలు మరికంటి ధనలక్ష్మి అధికారులు నీటి పారుదల శాఖ ఈఈ స్వర్గం నర్సింహారావు,  ఆర్‌అండ్‌బీ ఈఈ శ్యాంప్రసాద్‌, బీసీ కార్పొరేషన్‌, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ అధికారులు జ్యోతి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జడ్పీటీసీ సభ్యులకు గుర్తింపు కార్డులను చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, సీఈవో ప్రియాంక గుర్తింపు కార్డులను అందజేశారు.


 రైతువే దికలు పూర్తిచేయాలి: జడ్పీ అధ్యక్షుడు లింగాల కమల్‌రాజ్‌

దసరా పండుగ నాటికి జిల్లాలో నిర్మిస్తున్న రైతు వేదికలను పూర్తిచేయాలని జడ్పీ అధ్యక్షుడు లింగాల కమల్‌రాజ్‌ కోరారు. జడ్పీస్థాయి సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు శాస్త్ర సాంకేతిక, ఆధునిక వ్యవసాయ విధానం మరింత అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ రైతువేదికలను రూపొందించారని అన్నారు. వీటిని నిర్ధేశిత సమయంలోగా పూర్తిచేయాలని అధికారులను కోరారు.  

Updated Date - 2020-10-21T06:10:44+05:30 IST