పైర్లకు జీవం

ABN , First Publish Date - 2021-08-17T05:01:24+05:30 IST

పైర్లకు జీవం

పైర్లకు జీవం
గొట్టిగఖుర్ధు శివారులో పత్తి చేను

  • కులకచర్లలో 80 మి.మీ. వర్షం

ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌జిల్లా ప్రతినిధి/ బషీరాబాద్‌/ధారూరు/తాండూరు:  జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన వర్షం పంటలకు జీవం పోసినట్లు అయ్యింది. జూలైలో మురిపించిన వరుణుడు ఆ తరువాత 20 రోజులుగా ముఖం చాటేయడంతో కంది, పత్తి, పెపర, మినుము మెట్టపంటలు ఎండుముఖం పట్టాయి. ఎదుగుదల లేకుండా ఉన్న కంది, పత్తి చేలకు ఈ వర్షంతో మేలు చేకూరిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పత్తి పొలాల్లో ఎరువులు చల్లేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో అత్యధికంగా కులకచర్ల మండలంలో 80.0మి.మీ. వర్షపాతం నమోదైంది. యాలాల్‌లో 46.2 మి.మీ, బొంరా్‌సపేట్‌లో 37.2 మి.మీ, తాండూరులో 35.4 మి.మీ, పరిగిలో 35.2 మి.మీ, దోమలో 29.0 మి.మీ, ధారూరులో 28.6 మి.మీ, పెద్దేముల్‌లో 27.4 మి.మీ, బంట్వారంలో 21.2 మి.మీ, కొడంగల్‌లో 20.2 మి.మీ, దౌల్తాబాద్‌లో 15.6 మి.మీ, మోమిన్‌పేట్‌లో 15.0 మి.మీ, వికారాబాద్‌లో 14.2 మి.మీ, పూడూరులో 12.2 మి.మీ, మర్పల్లిలో10.6 మి.మీ, బషీరాబాద్‌లో 5.4 మి.మీ వర్షం కురిసింది. 

Updated Date - 2021-08-17T05:01:24+05:30 IST