Abn logo
Jul 12 2021 @ 07:38AM

గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు

తూర్పు గోదావరి: అల్లవరం మండలంలోని గ్రామాల్లో రేయింబవళ్లు అనధికార మద్యం షాపుల ద్వారా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దేవగుప్తం, గూడాల, కొమరగిరిపట్నం, ఓడలరేవు, బెండమూర్లంక, ఎన్‌.రామేశ్వరం, బోడసకుర్రు తదితర గ్రామాల్లో సుమారు 300కుపైగా మద్యం బెల్టుషాపులున్నా ఎక్సైజ్‌, పోలీసులు దాడులు చేసిన దాఖలాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. బడి, గుడి నిబంధన లేకుండా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. యానాం నుంచి అంబులెన్సుల ద్వారా రాత్రిళ్లు దేవగుప్తానికి మద్యం తరలించి యథేచ్ఛగా అమ్ముతున్నారు. నీళ్ల అమ్మకాల ముసుగులో, శివాలయం చెరువు వద్ద నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్ముతున్నారు. మద్యం లైసెన్సు షాపుల్లో సిబ్బంది క్వార్టరు సీసాకు అదనంగా రూ.10చొప్పున అమ్ముతున్నారు. వాటిని బెల్టుషాపుల్లో ఇంకా అదనంగా విక్రయిస్తున్నారు. ఎక్సైజ్‌ అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.