Abn logo
May 11 2021 @ 09:27AM

సాయంత్రం 5 నుంచి ఉదయం 5 వరకు స్వచ్ఛంద లాక్‌డౌన్‌

  • సరూర్‌నగర్‌ డివిజన్‌లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌


హైదరాబాద్/ఎల్‌బీనగర్‌ : కరోనా సెకండ్‌ వేవ్‌ను అరికట్టేందుకు సరూర్‌నగర్‌ డివిజన్‌లో వారం రోజుల పాటు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారు. సోమవారం ప్రారంభం కాగా.. ప్రతిరోజూ సాయంత్రం 5  నుంచి ఉదయం 5 గంటల వరకు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ నిర్వహిస్తున్నట్లు ఆ డివిజన్‌ కార్పొరేటర్‌ ఆకుల శ్రీవాణి అంజన్‌ పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందన్నారు. ఎవరిపై ఒత్తిడి ఉండదని, డివిజన్‌లోని ప్రజలు, వ్యాపారులతో చర్చించిన తరువాత స్వచ్ఛంద లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నామన్నారు. కరోనా అరికట్టడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.

Advertisement
Advertisement
Advertisement