Abn logo
Apr 7 2021 @ 18:37PM

తెలంగాణలో లాక్‌డౌన్‌.. కర్ఫ్యూ ఉండదు: మంత్రి ఈటల

హైదరాబాద్: ర్యాపిడ్‌ టెస్టులతో వెంటనే రిజల్ట్‌ వస్తుందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం ఈటల మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. ట్రేసింగ్‌ ఈజీ అయిందని, టెస్టుల సంఖ్య లక్ష వరకు పెంచాలని భావిస్తున్నామని ప్రకటించారు. ఆస్పత్రుల్లో ఓపీ సేవలతో పాటు కరోనా ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నామని తెలిపారు. జిల్లాల్లో ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో రోజుకు లక్ష మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని పేర్కొన్నారు. తెలంగాణలో లాక్‌డౌన్‌.. కర్ఫ్యూ ఉండదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.


తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో రెండు వేలకు చేరువలో రోజు వారీ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1,914 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,734కి కరోనా మరణాలు చేరాయి. ప్రస్తుతం తెలంగాణలో 11,617 యాక్టివ్‌ కేసులున్నాయి. 6,634 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 393 కరోనా కేసులు నమోదయ్యాయి.