Advertisement
Advertisement
Abn logo
Advertisement

శవ రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్: లోకేష్

కర్నూలు: వైఎస్సార్ శవాన్ని పక్కన పెట్టుకొని సీఎం పదవి కోసం సంతకాలు సేకరించిన కొడుకుగా సీఎం జగన్ చరిత్రలో నిలిచారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. మంగళవారం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ..  వైఎస్సార్ పేరిట ఓదార్పు యాత్ర చేయడం జగన్ శవరాజకీయాలకి పరాకాష్ట అని చెప్పారు. శవ రాజకీయమే పునాదిగా ఏర్పడిన పార్టీ వైసీపీదన్నారు. బాబాయ్ వివేకానందారెడ్డి హత్య కేసుని క్షుద్ర, శవ రాజకీయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌రెడ్డి అరాచక పాలనకి రాష్ట్రంలో అక్కాచెల్లెమ్మలు బలైపోతుంటే...వారి కుటుంబాలకు అండగా నిలబడటం శవ రాజకీయమా? అని నారా లోకేష్ ప్రశ్నించారు. 

Advertisement
Advertisement