Abn logo
Oct 14 2021 @ 18:30PM

సీఎం జగన్‌కు నారా లోకేష్ బహిరంగ లేఖ

అమరావతి: సీఎం జగన్‍కు టీడీపీ నేత నారా లోకేశ్ బహిరంగ లేఖ రాశారు. తొలగించిన ఆప్కాస్ ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవడం, 20 నెలల జీతాల బకాయిలను తక్షణ చెల్లింపుల గురించి లేఖ రాశారు.  మీరిచ్చిన హామీలను మీకు గుర్తు చేసేందుకు ఇలా లేఖలు రాయాల్సి రావడం విచారకరమన్నారు. పాదయాత్ర చేస్తూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నేనున్నాను.. నేను మీ గోడు విన్నానంటిరని, మీ మాటలు నమ్మి ఓట్లేసిన ఉద్యోగులంతా మీరు సీఎం కాగానే వాళ్లకిచ్చిన హామీలన్నీ నెరవేర్చుతారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, సీఎం కాగానే హామీలన్నీ గాలికొదిలేశారని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగభద్రత కల్పిస్తానని ఇచ్చిన మాట తప్పి ఉద్యోగాలే లేకుండా చేయడం వేలాది కుటుంబాలకు తీరని అన్యాయమేనన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption