అచ్చెన్న లేఖ రాయలేదు: లోకేశ్‌

ABN , First Publish Date - 2020-02-22T09:57:19+05:30 IST

దొంగ పేపర్‌, దొంగ చానల్‌ ట్రాప్‌లో పడి మీ పరువు తీసుకోకండి. రెండు వేల కోట్లు అంటూ అందరినీ తప్పుదోవ పట్టించారు. ఉన్నది రూ.2 లక్షలే అని తెలిశాక నాలుక కరుచుకున్నారు.

అచ్చెన్న లేఖ రాయలేదు: లోకేశ్‌

అమరావతి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ‘‘దొంగ పేపర్‌, దొంగ చానల్‌ ట్రాప్‌లో పడి మీ పరువు తీసుకోకండి. రెండు వేల కోట్లు అంటూ అందరినీ తప్పుదోవ పట్టించారు. ఉన్నది రూ.2 లక్షలే అని తెలిశాక నాలుక కరుచుకున్నారు. ఇప్పు డు బీసీ నాయకుడిపై పడ్డారు. బీసీలకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ట్విటర్‌లో మండిపడ్డారు. ‘‘తుగ్లక్‌ బీసీ నిధులు పక్కదారి పట్టించారని గళమెత్తినందుకు అచ్చెన్నాయుడికి అవినీతి మరక అంటించాలని ప్రయత్నిస్తున్నా రు. మందులు, వస్తువుల కొనుగోళ్లకు ఎలాంటి లేఖలు అచ్చెన్నాయుడు రాయలేదని ఆధారాలున్నా లీక్‌ వార్తలతో ఏదో పీకాలని దొంగ పేపర్‌, చానల్‌ తాపత్రయపడడంలో తప్పులేదు. కానీ మిగిలిన వాళ్లు క్విడ్‌ ప్రో కో వార్తల ట్రాప్‌లో పడితే ఉన్న విలువ పోతుంది’’ అని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-02-22T09:57:19+05:30 IST