కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర: రాయల

ABN , First Publish Date - 2020-12-05T05:12:51+05:30 IST

కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల వెంకటశేషగిరిరావు అన్నారు.

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర: రాయల

తల్లాడ/మధిర రూరల్‌, డిసెంబరు 4: కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల వెంకటశేషగిరిరావు అన్నారు. శుక్రవారం తల్లాడ మండలం లక్ష్మీపురం, రంగాపురం, బస్వాపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర దక్కేలా గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉండేవిధంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించటం జరుగుతుందన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, ఏవో ఎండీ.తాజుద్దీన్‌, ఎంపీటీసీ ఆదూరి వెంకటేశ్వర్లు, సొసైటీ చైర్మన్‌ అయిలూరి ప్రదీ్‌పరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల కార్యదర్శి దుగ్గిదేవర వెంకట్‌లాల్‌, సర్పంచ్‌లు ఓబుల సీతరామిరెడ్డి, సూరంపల్లి లక్ష్మీనారాయణ, చింతల రేణుక, శీలం కోటారెడ్డి, కలకొడిమ సొసైటీ వైస్‌చైర్మన్‌ దొబ్బల త్రివేణి, ఉపసర్పంచ్‌లు శీలం ముత్తారెడ్డి, రెక్కల లక్ష్మీ పాల్గొన్నారు.

మధిర రూరల్‌: రైతాంగం అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని జడ్పీచైర్మన్‌ లింగాల కమలరాజు అన్నారు. శుక్రవారం మధిర మండలం సిరిపురం, రాయపట్నం, మాటూరుపేట గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కమలరాజు ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ చిత్తారు నాగేశ్వరరావు, సర్పంచ్‌లు కనకపూడి పెద్దబుచ్చయ్య, నండ్రు సుశీల, రావూరి శివనాగకుమారి, ఎంపీడీవో విజయభాస్కర్‌రెడ్డి, ఏపీఎం రాంబాబు, పీసీ భారతి, టీఆర్‌ఎస్‌ నాయకులు రావూరి శ్రీను, చావా వేణు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-05T05:12:51+05:30 IST