మహబూబాబాద్‌లో ప్రోటోకాల్ రగడ

ABN , First Publish Date - 2021-08-21T18:22:56+05:30 IST

జిల్లాలోని నెల్లికుదుర్ మండలం రత్తిరాంతండాలో పోస్ట్ ఆఫీస్ బ్రాంచి కార్యాలయం ప్రారంభోత్సవంలో ప్రోటీకాల్ రగడ నెలకొంది.

మహబూబాబాద్‌లో ప్రోటోకాల్ రగడ

మహబూబాబాద్: జిల్లాలోని నెల్లికుదుర్ మండలం రత్తిరాంతండాలో  పోస్ట్ ఆఫీస్ బ్రాంచి  కార్యాలయం  ప్రారంభోత్సవంలో  ప్రోటీకాల్ రగడ నెలకొంది. పోస్టల్ శాఖ ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలో ప్రధాని నరేంద్రమోదీ ఫోటో లేకపోవడంతో  స్థానిక ఎంపీటీసీ మదన్  పోస్టల్ అధికారులను నిలదీశారు. కాగా పోస్టల్ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అంతేకాకుండా  సమావేశంలో గ్రామ సమస్యలపై  మాట్లాడకుండా స్థానిక ఎంపీటీసీని ఎంపీ, ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. 

Updated Date - 2021-08-21T18:22:56+05:30 IST