Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహబూబాబాద్ జిల్లా: సర్పంచ్ భర్త అరాచకం

మహబూబాబాద్: జిల్లాలో ఓ మహిళ సర్పంచ్ భర్త రెచ్చిపోయాడు. మహిళలని కూడా చూడకుండా వారిపై తన ప్రతాపాన్ని చూపించాడు. పెద్దవంగర మండలంలోని అవుతాపురం గ్రామంలోని మహిళలను టార్గెట్ చేసుకున్న సర్పంచ్ మంజుల భర్త సుధాకర్ వారిని ఇష్టమొచ్చినట్లు బూతులు తిడుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. తన కోరిక తీర్చాలని మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడాడు. అంతటితో ఆగకుండా గ్రామంలో తనకు నచ్చిన మహిళను టార్గెట్ చేసుకుని ఆమెతో నిత్యం ఫోన్‌లో మాట్లాడుతూ లైంగికంగా వేధించాడు. తనకు నచ్చిన మహిళలను తనతో గడిపేట్లు చేయాలని మరో మహిళను మధ్యవర్తిగా పెట్టుకుని రాయబారాన్ని కూడా నడిపించాడు. అయితే విషయం బయటకు పొక్కడంతో గ్రామ పంచాయతీకి పిలిపించి పంచాయతీ పెట్టించారు. సర్పంచ్ మంజుల, ఆమె భర్త సుధాకర్‌పై గ్రామస్తులు తిరగబడి వారిపై దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement