supermarketsలలో వైన్ అమ్మకాలు...మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి

ABN , First Publish Date - 2022-01-28T14:41:39+05:30 IST

మహారాష్ట్రలో ఇక నుంచి సూపర్ మార్కెట్లు, వాక్ ఇన్ స్టోర్లలోనూ వైన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి...

supermarketsలలో వైన్ అమ్మకాలు...మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి

ముంబై : మహారాష్ట్రలో ఇక నుంచి సూపర్ మార్కెట్లు, వాక్ ఇన్ స్టోర్లలోనూ వైన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.మహారాష్ట్రలోని సూపర్ మార్కెట్లు, వాక్-ఇన్ షాపుల్లో వైన్ విక్రయాలను అనుమతించే ప్రతిపాదననను మహారాష్ట్ర మంత్రివర్గం తాజాగా ఆమోదించింది.రైతులకు అదనపు ఆదాయాన్ని అందించే పండ్ల ఆధారిత వైన్ తయారీ కేంద్రాలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి నవాబ్ మాలిక్ విలేకరులకు తెలిపారు.1,000 చదరపు అడుగులు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న సూపర్ మార్కెట్‌లు,దుకాణాలు మహారాష్ట్ర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ కింద రిజిస్టర్  చేయించుకోవాలి. 


సూపర్ మార్కెట్లు వైన్ విక్రయించేందుకు లైసెన్స్ కోసం రూ.5,000 రుసుం చెల్లించాలి.అయితే ప్రార్థనా స్థలాలు,విద్యా సంస్థల సమీపంలోని సూపర్ మార్కెట్‌లలో వైన్ విక్రయించడానికి అనుమతించరు.రాష్ట్ర ప్రభుత్వం మద్యం వినియోగాన్ని ప్రోత్సహిస్తుందని ప్రతిపక్ష బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు.మహారాష్ట్రను మద్య రాష్ట్రంగా మార్చడానికి తాము అనుమతించమని ఫడ్నవీస్ చెప్పారు.


Updated Date - 2022-01-28T14:41:39+05:30 IST